HomeMovie News TeluguSSMB 29 నుంచి పిచ్చెక్కించే పోస్టర్.. ప్రియాంక చోప్రా లుక్‌తో కుర్రకారుకి షాక్!

SSMB 29 నుంచి పిచ్చెక్కించే పోస్టర్.. ప్రియాంక చోప్రా లుక్‌తో కుర్రకారుకి షాక్!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అత్యంత అవైటెడ్ సినిమా ‘SSMB29’. ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇందులో హీరోయిన్ ప్రియాంక చోప్రా సాంప్రదాయ చీరలో, చేతిలో గన్ పట్టుకుని ఫైర్ చేస్తున్న లుక్‌తో కుర్రకారుని మంత్రముగ్ధులను చేసింది.

ఎల్లో కలర్ చీరలో నడుము చూపిస్తూ, అదే సమయంలో గన్ ఫైరింగ్ సీన్‌లో కనిపించిన ప్రియాంక లుక్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. నడుము వద్ద బుల్లెట్ గాయం నుంచి రక్తం కారుతూ ఉన్న ఈ విజువల్ థ్రిల్లింగ్‌గా ఉండటంతో పాటు, ఆ లుక్‌లోని సౌందర్యం ఫ్యాన్స్‌ని ఫిదా అయ్యేలా చేసింది.

పోస్టర్‌లో ప్రియాంక చోప్రా కాళ్లకు చెప్పులు, చేతులకు బ్రాస్‌లెట్స్‌, చెవులకు రింగులతో కనిపించగా.. ఆమె గ్లామర్ అండ్ యాక్షన్ లుక్ ఒకేసారి కిల్లర్ కాంబినేషన్‌గా మారింది. ఈ సీన్ సినిమా హైలైట్‌గా నిలుస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టర్‌ను షేర్ చేస్తూ..

“ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ… దేశీ అమ్మాయి తిరిగి స్వాగతం! ‘మందాకిని’ లెక్కలేనన్ని ఛాయలను ప్రపంచం చూసే వరకు ఆగలేను,” అని రాసుకొచ్చారు.

దీని ద్వారా ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ‘మందాకిని’ అనే పాత్రలో నటిస్తున్నారని స్పష్టమైంది. ఫ్యాన్స్ ఆమె లుక్‌పై ఫిదా అవుతూ, “ఈ పేరు, ఈ లుక్ – పర్ఫెక్ట్ మ్యాచ్!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తం మీద, ‘SSMB29’ నుంచి రిలీజ్ అయిన ఈ మాస్ అండ్ క్లాసీ పోస్టర్ రాజమౌళి ఫ్యాన్స్‌కీ, మహేష్ బాబు అభిమానులకీ, అలాగే ప్రియాంక చోప్రా ఫాలోవర్లకీ డబుల్ ట్రీట్‌గా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular