టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్ మరింత దూకుడు మీద ఉంది. ఒకవైపు అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటూ, మరోవైపు తన కెరీర్లో కొత్త దశను ప్రారంభించింది. ప్రస్తుతం హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా సమంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది.

తాజాగా దీపావళి వేడుకల సందర్భంగా సమంత తన కొత్త ఇంట్లో పండుగ జరుపుకున్నారు. ఇటీవల సమంత కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్లోనే ఈ సారి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వేడుకల్లో దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా పాల్గొనడం హాట్ టాపిక్‌గా మారింది. సమంతతో రాజ్ నిడిమోరు రిలేషన్లో ఉన్నారని, త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గతంలోనూ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పటికీ ఇద్దరూ ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వకపోయినా, ప్రతి సందర్భంలో కూడా రాజ్ నిడిమోరు సమంతతో కనిపిస్తుండటంతో రూమర్స్ మళ్లీ వేడెక్కాయి. తాజాగా దీపావళి వేడుకల్లో కూడా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.





