మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద అన్నలాగా, ఎప్పుడూ అందరికీ అండగా నిలుస్తూ వస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు ముందుకొచ్చి సహాయం చేయడం ఆయన సహజ స్వభావం.
ఇక అలాంటి మెగాస్టార్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి పిలుపు మేరకు అనేకమంది సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ నయనతార, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
“ఇలాంటి క్షణాలు నా హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. ప్రేమ, నవ్వు కలిసినప్పుడు జీవితంలో వెలుగు మరింత పెరుగుతుంది. ఈ దీపావళి నాకు ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చింది” అని చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పెషల్ రోల్‌లో వెంకీ మామ మెరవబోతున్నారు.





