యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. దీపావళి సందర్భంగా విడుదలైన ‘K-ర్యాంప్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నారు. గత దీపావళికి ‘క’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం, ఈసారి కూడా అదే జోష్‌తో హిట్ కొట్టారు.
ఈ చిత్రం అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలై, మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.17.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు మూవీ టీమ్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది. అంటే కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందన్నమాట. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇంత భారీ కలెక్షన్లు సాధించడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.
Prekshaka Devullaki 🙏❤️#KRamp #DiwaliKAblockbuster pic.twitter.com/9b5Ednjm4J
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 21, 2025
యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథ, కామెడీ, ఎమోషన్ల మేళవింపుతో జనాలు థియేటర్లకు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఫలితంగా ‘K-ర్యాంప్’ ఆడుతున్న అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ షోలు నమోదవుతున్నాయని సమాచారం.
ఈ చిత్రంలో హీరోగా కిరణ్ అబ్బవరం నటించగా, యుక్తి తరేజా హీరోయిన్గా ఆకట్టుకున్నారు. ప్రముఖ నటుడు నరేష్ కీలక పాత్రలో మెరిశారు.





