HomeTeluguహెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై కోర్టుకెక్కిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై కోర్టుకెక్కిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల హెచ్‌-1బీ (H1-B) వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక, ఇంజినీరింగ్ రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ (US Chamber Of Commerce) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫీజు పెంపు కారణంగా అమెరికా గ్లోబల్ టాలెంట్‌ వినియోగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషన్‌లో పేర్కొంది.

అదేవిధంగా, ఈ నిర్ణయం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. హెచ్‌-1బీ ఫీజు పెంపు వల్ల విదేశీ అప్లికేషన్ల సంఖ్య తగ్గి, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా స్టార్టప్‌లు, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు.

కంపెనీలు ఇప్పుడు తమ ఉద్యోగుల ఖర్చులను భారీగా పెంచుకోవాల్సి రావడం లేదా తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకోవాల్సి రావడం తప్పదని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో వాదనగా తెలిపింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular