HomePolitics Teluguఏపీ పర్యటన చాలా ఆనందాన్నిచ్చింది.. ఎక్స్‌లో ప్రధాని మోడీ స్పందన

ఏపీ పర్యటన చాలా ఆనందాన్నిచ్చింది.. ఎక్స్‌లో ప్రధాని మోడీ స్పందన

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ముగించుకుని ఢిల్లీ (Delhi)కి తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ (X) వేదికగా స్పందించారు. ఏపీ పర్యటన తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ట్వీట్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా ప్రజలను మరింత శక్తివంతులను చేసే దిశగా అనేక ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.

“శ్రీశైలం క్షేత్రంలో గడపడం అపారమైన ఆనందాన్ని ఇచ్చింది. ఈ పవిత్ర స్థలంలో అడుగడుగున దైవత్వం నిండి ఉంది. ఇక్కడి ప్రజల సాదర స్వాగతానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. శ్రీ భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లు ఎల్లప్పుడూ మన దేశాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను,” అని మోడీ ఎక్స్‌లో రాశారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రధాని మోడీ ఈ రోజు కర్నూలు జిల్లా (Kurnool District)లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రెండు ప్రధాన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం, నన్నూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular