ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravati) లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త సీఆర్డీఏ (CRDA) కార్యాలయం నిర్మాణం పూర్తి అయింది. ఈ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు ఉదయం 9:54 గంటలకు ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగూరి నారాయణ పాల్గొన్నారు. రాయపూడి సమీపంలోని సీడ్ ఆక్సిస్ రోడ్ వద్ద నిర్మించబడిన ఈ సీఆర్డీఏ కార్యాలయం మొత్తం 3,07,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, జి+7 అంతస్తులతో రూపొందించబడింది.
ఈ భవనంలో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, బ్యాంకు, AI కమాండ్ సెంటర్, సమావేశ మందిరాలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, CRDA, ADCL విభాగాలు మరియు ఉన్నతాధికారుల ఛాంబర్లు ఏర్పాటు చేశారు. అదనంగా, టెర్రస్‌పై ఆధునిక ప్రీ-ఇంజినీర్డ్ డైనింగ్ ఏరియాను కూడా నిర్మించారు.
ఆధునిక నిర్మాణ శైలికి ప్రతిరూపం, అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం, రేపే ప్రారంభం..
— Telugu Desam Party (@JaiTDP) October 12, 2025
2019లో ఆగిన చోటే మొదలైంది.. ధగధగలతో మెరుస్తున్న ఈ భవనం 16 నెలల్లోనే పూర్తయ్యింది..
సీఆర్డీఏ భవనం ప్రత్యేకతలు :
అంతస్తులు : 7
మొత్తం విస్తీర్ణం : 4.23 ఎకరాలు
బిల్టప్ ఏరియా : 2.42 లక్షల చదరపు… pic.twitter.com/dFJAYMYxEM
ఈ భవనం “A” ఆకారంలో డిజైన్ చేయబడింది, ఇది అమరావతి గుర్తింపును ప్రతిబింబిస్తుంది. సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం ద్వారా అమరావతి మళ్లీ పరిపాలన కేంద్రంగా మారబోతోంది.
ఇప్పటి వరకు విజయవాడలో కొనసాగిన సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ADCL) మరియు మునిసిపల్ పరిపాలన శాఖలు ఇకపై ఒకే చోట నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందించడమే కాకుండా, రాజధాని అభివృద్ధి పునరుద్ధరణకు ఈ భవనం కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.





