నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ‘అఖండ-2: తాండవం’ (Akhanda-2: Tandavam). 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘అఖండ’ సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట నిర్మాతలుగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మాణంలో ఉంది.
హీరోయిన్గా సంయుక్తా మీనన్ (Samyuktha Menon) నటిస్తుండగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The Pandit duo of Shravan Mishra and Atul Mishra are on board for #Akhanda2 background score ❤🔥@MusicThaman is leaving no stone unturned for making the score special 💥💥
Get ready for a goosebumps inducing score with divine chants ❤️🔥🔱
IN CINEMAS WORLDWIDE FROM DECEMBER… pic.twitter.com/M4fBLzg2Wt
— 14 Reels Plus (@14ReelsPlus) October 12, 2025
ఈ నేపథ్యంలో, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ‘అఖండ-2’కు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు. ‘అఖండ’లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అనుభూతిని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు తమన్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
ఇందుకోసం సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు చెప్పడంలో నిపుణులైన పండిట్ శ్రవణ్ మిశ్రా మరియు పండిట్ అతుల్ మిశ్రా సోదర ద్వయాన్ని ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దింపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు – “పండిట్ ద్వయం శ్రవణ్ మిశ్రా మరియు అతుల్ మిశ్రా ‘అఖండ-2’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం సిద్ధంగా ఉన్నారు. తమన్ సంగీతాన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దైవిక మంత్రాలతో అద్భుతమైన మ్యూజికల్ అనుభూతి కోసం రెడీ అవ్వండి. గూస్ బంప్స్ ఖాయం!” అని పేర్కొన్నారు.
ఈ అప్డేట్ చూసిన నెటిజన్లు “ఇక థియేటర్స్‌లో రుద్ర తాండవమే!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.





