డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు జాతీయ అవార్డు గ్రహీత, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది.
‘బ్లాక్‌బస్టర్ సంగీత దర్శకుడు.. అతని సంగీతం మాటల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది’ అనే క్యాప్షన్‌తో హర్షవర్ధన్‌ను టీమ్ తమ బృందంలోకి ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేసింది.
The blockbuster composer whose music speaks louder than words 🎵🎧
— Puri Connects (@PuriConnects) October 9, 2025
Team #PuriSethupathi welcomes National Award-winning music director @rameemusic on board ❤️🔥
Get ready for a new-age musical experience that blends action, emotion, and elevation 💥
A #PuriJagannadh film 🎬… pic.twitter.com/Ko50mIcZbq
ఇప్పటికే “అర్జున్ రెడ్డి”, “యానిమల్” వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో తన సంగీత ప్రతిభను చాటుకున్న హర్షవర్ధన్, ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న “స్పిరిట్” సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు పూరీ సేతుపతి ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా, వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న మరో ప్రాజెక్ట్‌కి కూడా హర్షవర్ధన్ సంగీతం అందించనున్నట్లు సమాచారం.
పూరి సేతుపతి సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తుండగా, విజయ్ కుమార్, వీటీవీ గణేష్, టబు, రాధికా అప్టే వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు జెబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, నారాయణ రావు నిర్మిస్తున్నారు.
ఈ క్రేజీ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది.





