HomePolitics Teluguజూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. జూబ్లీహిల్స్‌ నుంచి స్థానిక నాయకుడు నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ హైకమాండ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వంటి పలువురు నేతలు బలంగా ప్రయత్నించినా, చివరికి హైకమాండ్‌ నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది.

ఈ నిర్ణయానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆశావహులను పిలిచి మాట్లాడారని సమాచారం. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని, భవిష్యత్తులో తప్పకుండా సముచిత గౌరవం కల్పిస్తామని వారిని నచ్చజెప్పారట. దీంతో మిగిలిన నేతలు పోటీ నుంచి తప్పుకోవడంతో, నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్‌ అయింది.

ఈ ఉప ఎన్నికలు నవంబర్ 11న జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన మాగంటి గోపీనాథ్‌ (62) మృతితో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. దీంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడైన నవీన్ యాదవ్‌పై నమ్మకం ఉంచింది.

జూబ్లీహిల్స్‌లో ఈసారి పోటీ హాట్‌గా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌ మృతుడైన ఎమ్మెల్యే స్థానంలో ఆయన భార్య మాగంటి సునీత రంగంలోకి దిగుతుండగా, కాంగ్రెస్ తన అభ్యర్థిని కూడా ఖరారు చేయడం రాజకీయంగా హైప్‌ సృష్టించింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular