HomeHomeమోహన్ బాబు యూనివర్సిటీకి భారీ షాక్.. గుర్తింపు రద్దు సిఫార్సు చేసిన విద్యా కమిషన్

మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ షాక్.. గుర్తింపు రద్దు సిఫార్సు చేసిన విద్యా కమిషన్

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) స్థాపించిన మోహన్ బాబు యూనివర్సిటీకి (Mohan Babu University) ఊహించని షాక్ తగిలింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఉన్నత విద్యా కమిషన్ (Higher Education Commission) దృష్టి సారించింది.

గత మూడు సంవత్సరాలుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి సుమారు రూ.26 కోట్లు అదనంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పలువురు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విద్యా కమిషన్‌కి ఫిర్యాదులు చేశారు. విచారణ అనంతరం, కమిషన్‌కి ఈ ఆరోపణలు నిజమని తేలింది.

దీంతో కమిషన్‌ మోహన్ బాబు యూనివర్సిటీపై రూ.15 లక్షల జరిమానా విధించింది. అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లను 15 రోజుల్లో విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఈ సిఫార్సుపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ ఘటనతో యూనివర్సిటీ పరిపాలనలో కలకలం రేగింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular