80ల స్టార్ల మ్యాజిక్కి ఇంకా క్రేజ్ తగ్గలేదు. మెగాస్టార్ నుంచి కామెడీ స్టార్ల వరకు.. అప్పట్లో తెరపై దుమ్ము దులిపిన ఈ నటీనటులందరికీ మధ్య ఉన్న బాండింగ్ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. హీరో హీరోయిన్లుగా బిజీగా గడిపిన ఈ యాక్టర్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా లేదా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నా, పాత తీపి జ్ఞాపకాలను మాత్రం మరవడం లేదు.

గత 12 ఏళ్లుగా 80s స్టార్స్ ప్రతీ ఏడాది ఒక రీయూనియన్ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. దక్షిణ భారత నాలుగు భాషలకు చెందిన నటీనటులు ఈ వేడుకలో పాల్గొంటూ ముచ్చటగా గడుపుతారు.
The 80s Stars Reunion: The laughter, the music, the memories ♥️🎶💃🕺#80sStarsReunion #Reunion #Kollywood #Tollywood #Mollywood #Sandalwood #Bollywood
📷: @thephotogiraffe pic.twitter.com/6r5fl7dSYk
— Nikil Murukan (@onlynikil) October 7, 2025
తాజాగా జరిగిన ఈ సంవత్సరం రీయూనియన్‌కి “చిరుత థీమ్”ను ఎంచుకున్నారు. ఫారెస్ట్ కాన్సెప్ట్‌లో ఆటపాటలతో మునిగిపోయారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నరేష్, సురేష్, జాకీ ష్రాఫ్, మలయాళ నటుడు జయరామ్, సుహాసిని, రేవతి, కుష్బూ, రమ్యకృష్ణ, లిజీ, నదియా, శరత్ కుమార్, రాజ్ కుమార్ సేతుపతి, సుప్రియ, జయసుధ, సుమలత, శోభన వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

వీరి ఆనంద క్షణాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం “మన చిరుతలు మళ్లీ దూసుకెళ్లారు!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





