ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా మారుమోగిపోతున్న మ్యూజిక్ డైరెక్టర్లలో శాశ్వత్ సచ్దేవ్ పేరు ముందువరుసలో నిలుస్తోంది. ఇటీవల విడుదలైన ధురంధర్ చిత్రానికి ఆయన అందించిన సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమాకు ముందు వరకు శాశ్వత్ సచ్‌దేవ్‌కు అంతగా గుర్తింపు లేకపోయినా, ధురంధర్ విజయం తర్వాత ఆయన పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు వచ్చిన ప్రశంసలు ఆయన కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారాయి.
ఈ సక్సెస్‌తో తెలుగు సినీ పరిశ్రమ కూడా ఆయనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పలువురు దర్శకులు, నిర్మాతలు శాశ్వత్ సచ్దేవ్తో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం.
త్వరలో యువ హీరో నిఖిల్ నటించనున్న ది ఇండియా హౌస్ చిత్రానికి ఇప్పటికే ఆయనను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా నేచురల్ స్టార్ నాని – సుజిత్ కాంబోలో తెరకెక్కనున్న బ్లడీ రోమియో సినిమాకు, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న మరో భారీ ప్రాజెక్ట్‌కు కూడా ఆయనను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలని చర్చలు జరుగుతున్నట్లు టాక్.
ఒక్క సినిమాతోనే భారీ గుర్తింపు సంపాదించిన శాశ్వత్ సచ్‌దేవ్‌కు ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వస్తుండటం విశేషం. రాబోయే రోజుల్లో ఆయన తెలుగు సినీ పరిశ్రమలో బిజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.





