HomeMovie News Teluguఅల్లు అర్జున్ రాకా ఫస్ట్ లుక్ రిలీజ్..

అల్లు అర్జున్ రాకా ఫస్ట్ లుక్ రిలీజ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు భారీ సర్ప్రైజ్ లభించింది. బన్నీ – అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఈ చిత్రానికి రాకా అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లు అర్జున్ లుక్ చూసి సినీ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. గుండు లుక్, కళ్లకు కాటుక, సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో ఆయన పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నారు.

అంతేకాకుండా ఆయన నుదిటిపై వైకింగ్ ట్యాటూలను పోలిన గుర్తులు, పోస్టర్‌లో కనిపించిన జంతువు గోళ్లు సినిమా థీమ్‌పై మరింత ఆసక్తిని పెంచాయి. ఈసారి అట్లీ భారీ విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రాకా ఫస్ట్ లుక్‌ను బట్టి చూస్తే, ఇది ఒక ఊహించని పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది అత్యంత డిఫరెంట్, ఇంటెన్స్ లుక్ అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ స్టార్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాత కళానిధి మారన్, అల్లు అర్జున్, అట్లీ కలిసి లాస్ ఏంజిల్స్‌లోని టాప్ VFX టీమ్‌తో పని చేస్తున్నట్లు సమాచారం.

హాలీవుడ్‌లో ఐరన్ మ్యాన్ 2, ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఆ టీమ్ సభ్యులు కూడా ఈ స్క్రిప్ట్‌ను ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం.

ఇక బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తూ, భారతీయ సినిమాలో ఇప్పటివరకు చూడని అద్భుతాన్ని అట్లీ సృష్టిస్తున్నాడు అని అన్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular