HomeMovie News Teluguపెద్ది లో మృణాల్ ఔట్?.. ఆ హీరోయిన్ కు బంపర్ ఆఫర్!

పెద్ది లో మృణాల్ ఔట్?.. ఆ హీరోయిన్ కు బంపర్ ఆఫర్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మాస్ ఎమోషనల్ డ్రామా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో ఉండబోయే స్పెషల్ ఐటెం సాంగ్‌పై గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ నడుస్తోంది. ముందుగా ఈ పాటలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో రామ్ చరణ్‌తో ఆమె స్టెప్పులు వేస్తుందని అభిమానులు భావించారు.

అయితే తాజా టాక్ ప్రకారం, మృణాల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ మానస వారణాసి ను మేకర్స్ ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో యూత్‌లో గుర్తింపు తెచ్చుకున్న మానస వారణాసికు, రెండో సినిమాకే గ్లోబల్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసే అవకాశం రావడం విశేషంగా మారింది. ఈ సాంగ్ కోసం బుచ్చిబాబు ప్రత్యేకంగా గ్రాండ్ స్టెప్పులు ప్లాన్ చేస్తున్నారని, మానస గ్లామర్ ఈ పాటకు హైలైట్ అవుతుందని టాక్.

నెటిజన్లు కూడా ఇది మానసకు బంపర్ ఆఫర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు, సినిమా విడుదల తేదీ విషయంలో కూడా మార్పులు ఉండొచ్చని సమాచారం. మొదట ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని భావించిన మేకర్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరింత సమయం తీసుకుంటున్నారట. దీంతో సినిమా జూన్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మొత్తానికి, రామ్ చరణ్ మాస్ లుక్‌తో పాటు ఈ స్పెషల్ సాంగ్ కూడా పెద్ది కి హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular