HomeMovie News Teluguశ్రీదేవి కూతురు చాలా చాలా తెలివైంది సుమీ!

శ్రీదేవి కూతురు చాలా చాలా తెలివైంది సుమీ!

అతిలోక సుందరి శ్రీదేవితో పోల్చితే, ఆమె కుమార్తె జాన్వీ కపూర్‌ చాలా చాలా తెలివైనదట. ఈ విషయం ఆమెతో పనిచేసిన ‘ధడక్‌’ టీమ్‌ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చిన సంగతి తెల్సిందే. ఆ సంగతి పక్కన పెడితే, తెలుగులో జాన్వీ కపూర్‌ గతంలోనే ఓ సినిమా చేయాల్సి వుంది. శ్రీదేవి తెలుగునాట ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్‌లో ఆమె లేడీ సూపర్‌ స్టార్‌ అయ్యిందంటే, అలా ఆమె బాలీవుడ్‌కి వెళ్ళడానికి తొలి అడుగు తెలుగులో దక్కిన స్టార్‌ డమ్‌ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

అందుకే శ్రీదేవి ఎప్పుడూ తెలుగు సినీ పరిశ్రమ గురించి తక్కువగా మాట్లాడలేదు. తెలుగు సినీ పరిశ్రమను మర్చిపోలేదు. అయితే జాన్వీ కపూర్‌ విషయంలో మాత్రం శ్రీదేవి, టాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌ వైపే మొగ్గు చూపింది. ‘ధడక్‌’ తర్వాత తెలుగులో జాన్వీతో ఓ సినిమా చేయాలనుకుంది శ్రీదేవి. కానీ శ్రీదేవి ఇప్పుడు జీవించి లేదు. జాన్వీ కపూర్‌ని తెలుగు సినిమాల గురించి అడిగితే, బాలీవుడ్‌లో నిలదొక్కుకున్న తర్వాతే తెలుగు సినిమాల గురించి ఆలోచిస్తానని అంటోంది జాన్వీ.

తెలుగులో ఏ హీరో సరసన నటించాలని జాన్వీ అనుకుంటోందో తెలుసా? ఇంకెవరు, విజయ్‌ దేవరకొండ అట. ఇలాంటి మాటలు బాలీవుడ్‌ హీరోలు చెప్పడం మామూలే. అలియా భట్‌ తెలుగులో తాను సినిమా చేస్తాననీ, అలా చేయడమంటూ జరిగితే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తోనే చేస్తానని చెప్పింది. కానీ, అలియా తెలుగు సినిమాల పట్ల అంత ఆసక్తితో లేదు. రెమ్యునరేషన్‌ దగ్గరే చాలామంది బాలీవుడ్‌ హీరోయిన్లు సౌత్‌లో చేయడానికి ఒకప్పుడు మొహమాట పడేవారు.

ఇప్పుడు తెలుగు సినిమాకి పెరిగిన క్రేజ్‌ నేపథ్యంలో అందరూ టాలీవుడ్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. మరి జాన్వీ ఎందుకు అలా మాట్లాడుతోంది? విజయ్‌ దేవరకొండతో సినిమా చేస్తానని చెప్పడం, తెలుగు సినిమాలకు టైమ్‌ లేదని చెప్పడం, బాలీవుడ్‌లో తొలుత నిలదొక్కుకోవాలనడం ఇవన్నీ ఆమెకున్న ‘ఎక్కువ తెలివితేటలకు’ నిదర్శనం అనుకోవాలా?

You May Like This
- Advertisment -spot_img

Most Popular