HomeMovie News Telugu10 రోజుల్లో 20 కోట్లు.. ఇది విజయ్ దేవరకొండ స్టామినా..!

10 రోజుల్లో 20 కోట్లు.. ఇది విజయ్ దేవరకొండ స్టామినా..!

రోజు రోజుకీ త‌న ఇమేజ్‌నీ స్టార్ డ‌మ్‌నీ పెంచుకుంటూ పోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. `టాక్సీవాలా`కి వ‌చ్చిన వ‌సూళ్లే అందుకు నిద‌ర్శ‌నం. ఈ సినిమా ఎలాంటి అంచ‌నాలూ లేకుండా విడుద‌లైంది. దానికి తోడు.. పైర‌సీ వ‌ల్ల విడుద‌ల‌కు ముందే హెచ్ డీ క్వాలిటీతో సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయినా స‌రే… టాక్సీవాలా బాక్సీఫీసు ద‌గ్గ‌ర దుమ్ము దులిపింది.

ప‌ది రోజుల్లో రూ.20 కోట్లు సాధించి హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. రూ.4.5 కోట్ల‌తో పూర్త‌యిన సినిమా ఇది. ఈ రేంజులో వ‌సూళ్లు రావ‌డం.. నిజంగా అబ్బుర‌మే. నోటా ఫ్లాపుకి.. టాక్సీవాలాతో విజ‌య్ స‌మాధానం చెప్పిన‌ట్టైంది. ఒక్క నైజాంలోనే రూ.7.5 కోట్లు తెచ్చుకుంది. ఓవ‌ర్సీస్‌లో రూ.2.80 కోట్లు వ‌చ్చాయి. సీడెడ్‌లో 1.70 కోట్లు తెచ్చుకుంది. ఓ సినిమా విడుద‌ల‌కు ముందే పైర‌సీ రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చేసినా, ఈ స్థాయి వ‌సూళ్లు సాధించ‌డం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్ని సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

కంటెంట్‌ని న‌మ్ముకున్న సినిమాల‌కు తిరుగులేద‌ని `టాక్సీవాలా` నిరూపించినట్టైంది. ఈ వారం రోబో 2.ఓ వ‌స్తోంది. కాబ‌ట్టి.. టాక్సీవాలా దూకుడుకు బ్రేకులు ప‌డొచ్చు. రోబో ఫ‌లితం అటూఇటూఅయితే మాత్రం అది టాక్సీవాలాకు బోన‌స్‌గా మారడం ఖాయం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular