HomeMovie News Telugu'మెగా' మంచి మనసుకి ఫిదా అయిన బేబీ.!

‘మెగా’ మంచి మనసుకి ఫిదా అయిన బేబీ.!

తూర్పుగోదావరి జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ సాధారణ మహిళ, తాను పాడిన ఓ పాట కారణంగా ఇప్పుడు ‘టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌’గా మారింది. చిన్నప్పటినుంచీ పాటలు పాడుతోన్న ఆమెను చూసి, ఆ ఊరివాళ్ళంతా మెచ్చుకునేవారు. ఓ సారి ఆమె పాట పాడుతుండగా, ఫోన్‌లో షూట్‌ చేసిన ఆమె స్నేహితురాలు.. ఆ వీడియోను సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేసింది. అంతే, సోషల్‌ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది. ఇక, అక్కడినుంచి ఆమె దశ తిరిగిపోయింది.

ఏకంగా, మెగాస్టార్‌ చిరంజీవిని కలిసే ఛాన్స్‌ ఆమెకు తెచ్చిపెట్టింది. ఆమె పేరు బేబీ. తాజాగా చిరంజీవిని కలిసింది బేబీ. చిరంజీవి యెదుట అలా కూర్చునేసరికి ఆమెకు మాటలు రాలేదట. చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్న బేబీ, ‘నా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు.. ఇక నా ప్రాణం పోయినా ఫర్వాలేదేమో..’ అనేసిందట. సంగీత దర్శకుడు కోటి చొరవతో, బేబీకి సినీ అవకాశాలొస్తున్నాయి. కోటి స్వయంగా చిరంజీవిని కలిసే అవకాశం బేబికి కల్పించడం జరిగింది. మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి సురేఖ, బేబికి ఆతిథ్యం ఇచ్చారు.

చిరంజీవి ప్రశంసలు మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ విన్నా బేబి గురించిన చర్చే జరుగుతోంది. అంతలా పాపులర్‌ అయ్యిందామె. సినిమాల్లో పాటలు పాడే అవకాశాలూ ఆమెకు వస్తున్నాయి. మట్టిలో మాణిక్యం అంటే ఇలాగే వుంటారని చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది. అది ఇంకోసారి తాజాగా బేబి రూపంలో నిజమయ్యిందంతే. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular