HomeMovie News Teluguమోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడంటే.!

మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడంటే.!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఇంకా వచ్చేలా కనిపించడం లేదు. అదేనండీ నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య వందో చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని ప్రచారం జరిగింది. కానీ జరగలేదు. తర్వాత బాలయ్య రెండు చిత్రాల్లో నటించేశారు. 

ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఎన్టీఆర్‌’తో బిజీగా ఉన్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ వార్తల్లోకెక్కి రెండేళ్లు కావస్తున్నా, ఇంకా అది సాధ్యపడలేదు. అయితే ఈ ఏడాది కూడా నందమూరి వారసుడు వచ్చేది లేదని తాజా సమాచారమ్‌. కానీ వచ్చే ఏడాది పక్కా అని తెలుస్తోంది. మోక్షజ్ఞను తెలుగు తెరకు పరిచయం చేయబోయే డైరెక్టర్‌ విషయంలోనే మల్లగుల్లాలు జరుగుతున్నాయట. ఖచ్చితంగా సీనియర్‌ డైరెక్టర్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య రంగం సిద్ధం చేస్తున్నారట. ఆ లిస్టులో వినాయక్‌, పూరీ జగన్నాధ్‌, క్రిష్‌ ఇలా పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే వీరందరిలోనూ పూరీ జగన్నాధ్‌ పైనే బాలయ్య ఎక్కువ నమ్మకంగా ఉన్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

‘పైసా వసూల్‌’ టైంలోనే ఈ విషయంపై క్లారిటీ తీసుకున్నారట బాలయ్య. ఆ దిశగా పూరీ జగన్నాధ్‌ కథలు కూడా సిద్ధం చేశాడనీ తెలుస్తోంది. ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్న మోక్షజ్ఞ తెరంగేట్రం త్వరలోనే పూరీ జగన్నాధ్‌ డైరెక్షన్‌లో ఉండబోతుందేమో మరి. అయితే పూరీకి ప్రస్తుతం సక్సెస్‌లు లేక సతమతమవుతున్నాడు. అలా అని తక్కువంచనా వేయలేం పూరీని. 

మెగా పవర్‌స్టార్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన గ్రాండ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ పూరీ ఖాతాలో ఉంది కదా. అది మర్చిపోకూడదు మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular