HomeMovie News Teluguబాబోయ్‌ రకుల్‌.. ఇలా హీటెక్కించేస్తోందేంటీ.!

బాబోయ్‌ రకుల్‌.. ఇలా హీటెక్కించేస్తోందేంటీ.!

బాలీవుడ్‌ గాలి సోకగానే, అందాల భామలు తమ అందాల విందు విషయంలో హద్దులు చెరిపేస్తుంటారు. ఈ లిస్ట్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరుని ప్రముఖంగా చెప్పుకోవాల్సి వుంటుంది. ఆ మధ్య ‘అయ్యారీ’ సినిమా ప్రమోషన్స్‌ టైమ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పొట్టి పొట్టి దుస్తులేసుకుని, హాట్‌ హాట్‌గా హల్‌చల్‌ చేసిన విషయం విదితమే. ప్రమోషన్‌లో భాగంగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పొట్టి నిక్కరు అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. ఓ కార్యక్రమంలో, హీరో ఆమెని అమాంతం పైకి ఎత్తేస్తే, అది కాస్తా జుగుప్సాకరంగా అన్పించింది.

అయితే, ఇదంతా బాలీవుడ్‌లో సర్వసాధారణమే. అందుకే, రకుల్‌ ఇంకోసారి ఆ తరహా హాట్‌ అప్పీల్‌ షురూ చేసేసింది. కొత్తగా మరో బాలీవుడ్‌ సినిమాకి ‘సైన్‌’ చేసిన రకుల్‌, సోషల్‌ మీడియాలో డబుల్‌ యాక్టివేట్‌ అయినట్లుంది. హాట్‌ హాట్‌గా ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేస్తోంది. ఇకనేం, ఆమె అభిమానులు ఊగిపోతున్నారు.. రీ-ట్వీట్లు, లైకులతో పోటెత్తేస్తున్నారు. రకుల్‌ ఆశిస్తున్నదీ ఇదే మరి.

సౌత్‌కి వచ్చేసరికి మాత్రం రకుల్‌లో కంప్లీట్‌ ఛేంజ్‌ ఓవర్‌ కన్పిస్తుంటుంది. అలాగని ఇక్కడ ఆమె హాట్‌గా కన్పించదని కాదు. ఇక్కడ ఆమెకి కొన్ని హద్దులుంటాయి.. అవి ఆమె గీసుకున్నవే. కొన్ని సినిమాల్లో హద్దులు దాటి ఎక్స్‌పోజింగ్‌ చేసినా.. రకుల్‌ సౌత్‌ లెక్కలు, బాలీవుడ్‌తో పోల్చితే భిన్నంగా వుంటున్నాయి. ఏదిఏమైనా, రకుల్‌ రోజురోజుకీ హీటెక్కించే ఫొటోలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడం ఆమె అభిమానులకి పండగే పండగ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. 

@Rakulpreet latest click 🔥🔥🔥🔥#RakulPreetSingh #RakulPreet #Rakul #RakulFanMadhu pic.twitter.com/KPUMoKEu9B— Rakul Fan Madhu (@RakulFanMadhu) 14 November 2018

You May Like This
- Advertisment -spot_img

Most Popular