HomeMovie News Teluguముద్దుగుమ్మ 'ముద్దు' ముచ్చట

ముద్దుగుమ్మ ‘ముద్దు’ ముచ్చట

‘కవచం’ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. ఈ టీజర్‌ విడుదల కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్‌ థింగ్స్‌ చోటు చేసుకున్నాయి. హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మరో హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్‌ని ముద్దాడింది.. అదీ ఆప్యాయంగా. అదే వేదికపై ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె నాయుడు, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ని ముద్దాడేశాడు. 

సినీ పరిశ్రమలో ముద్దులు, కౌగలింతలు మామూలే. ‘హగ్‌’ అనేది సర్వసాధారణమిక్కడ. ఆప్యాయంగా పలకరింపుకీ ‘ఘాటైన హగ్‌’ని వాడేస్తుంటారు. కానీ, ఇప్పుడు సినీ పరిశ్రమని ‘మీ..టూ..’ ఓ కుదుపు కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరు కొంత అత్యుత్సాహం ప్రదర్శించినా అంతే సంగతులు. ఇప్పుడు ఛోటా కె నాయుడు పరిస్థితి ఏంటి.? కాజల్‌ అగర్వాల్‌, ఛోటా కె నాయుడుపై విరుచుకుపడ్తుందా? అని అందరూ చర్చించుకుంటున్నారు. 

నిజానికి, కాజల్‌ అగర్వాల్‌ ఆ వేదికపై తనను అలా ఛోటా కె నాయుడు, హగ్‌ చేసుకుని, ముద్దు పెట్టడంతో షాక్‌ అయ్యింది. కానీ, అతని సీనియారిటీని ఆమె అక్కడ గౌరవంచింది. హుందాగా వ్యవహరించింది. ఏమాత్రం సంయమనం కోల్పోలేదు. ఆమె కళ్ళల్లో షాక్‌ అయిన తీరు స్పష్టంగా కన్పించింది. కాజల్‌ మాత్రమే కాదు, పక్కనే వున్న మెహ్రీన్‌ కూడా ఛోటా కె నాయుడు చేసిన పనికి షాక్‌ అయ్యింది. 

కాజల్‌, మెహ్రీన్‌ని ముద్దాడటం వేరే సంగతి. యంగ్‌ హీరోయిన్‌కి, సీనియర్‌ హీరోయిన్‌ ఇచ్చే ప్రోత్సాహంగా దాన్ని భావించాల్సి వుంటుంది. సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ అయిన ఛోటా కె నాయుడు ఎందుకిలా విపరీతంగా ప్రవర్తించాడు? ఏమో, ఆయనకే తెలియాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular