HomeMovie News Teluguమల్టీస్టారర్‌ ప్లానింగ్‌లో నాగార్జున

మల్టీస్టారర్‌ ప్లానింగ్‌లో నాగార్జున

నాగార్జునకి మల్టీ స్టారర్స్‌ కొత్తేమీ కాదు. గతంలో పలు యంగ్‌ హీరోస్‌తో నాగార్జున మల్టీ స్టారర్‌ చిత్రాల్లో నటించాడు. అయితే ఈ సారి మాత్రం ఓ బిగ్‌ మల్టీ స్టారర్‌ని రూపొందించే ప్లానింగ్‌లో ఉన్నాడట నాగార్జున. అన్నపూర్ణా స్టూడియోస్‌ బ్యానర్‌లో ఆ సినిమాని నాగార్జునే స్వయంగా నిర్మించాలనుకుంటున్నాడట. ప్రస్తుతం నాగార్జున, రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది ఈ సినిమా. ఈ సినిమా పూర్తయ్యాక ఈ బిగ్‌ మల్టీ స్టారర్‌పై నాగార్జున ఫోకస్‌ పెట్టనున్నాడట.

ఎప్పటికప్పుడే కొత్తదనం కోసం ఆలోచిస్తూ ఉంటాడు నాగ్‌. అందుకే నాగార్జున నుండి, ‘అన్నమయ్య’ వంటి సరికొత్త ఆధ్యాత్మిక చిత్రాలు వచ్చాయి. మల్టీ స్టారర్స్‌ అంటే కొత్త కొత్త కథలు రూపుదిద్దుకుంటాయి. అందుకే అటువైపు దృష్టి సారించాడట నాగార్జున. ఇప్పటికే నాగార్జున డైరీలో ఓ మల్టీ స్టారర్‌ రెడీగా ఉంది. యంగ్‌ హీరో నాని, నాగ్‌తో కలిసి నటిస్తున్నాడు ఆ మల్టీ స్టారర్‌లో. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. ఈలోగా నాగార్జున మరో బిగ్‌ మల్టీ స్టారర్‌కి ఆలోచన చేయడం నాగ్‌ అభిమానులను మిక్కిలి సంతోషానికి గురి చేసే విషయమే. 

అయితే ఆ బిగ్‌ మల్టీ స్టారర్‌లో నటించే నటీనటులు ఎవరన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ త్వరలోనే నాగార్జున ఆ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నాడట. ఇప్పటికే మహేష్‌బాబు – వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ – వెంకటేష్‌ తదితర బిగ్‌ మల్టీ స్టారర్స్‌ టాలీవుడ్‌లో సందడి చేశాయి. ఇక నాగ్‌ చేస్తున్న ఆలోచన వర్కవుట్‌ అయితే త్వరలోనే అంతకు మించిన బిగ్‌ మల్టీ స్టారర్‌ని తెలుగు ఆడియన్స్‌ ఎంజాయ్‌ చెయ్యొచ్చన్న మాట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular