HomeMovie News Teluguహీరోగారి హైటు తెచ్చి పెట్టింది ఫైటు!

హీరోగారి హైటు తెచ్చి పెట్టింది ఫైటు!

తమిళ హీరో సూర్య హైట్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సూర్య హైట్‌ గురించి ఓ తమిళ న్యూస్‌ ఛానెల్‌లో వెటకారంగా కామెంట్స్‌ చేశారు. దాంతో ఆ ఛానెల్‌ కార్యాలయం వద్ద సూర్య ఫ్యాన్స్‌ ఆందోళనకు దిగారు. దాంతో తమిళనాడుతో ఈ అంశం తీవ్ర దుమారం లేపుతోంది.

బాలీవుడ్‌లో బిగ్‌బీ అమితాబ్‌తో కలిసి సూర్య ఓ సినిమాలో నటిస్తున్నాడు. అమితాబ్‌ ముందు సూర్య హైట్‌ సరిపోదనీ, స్టూల్‌ వేసి అమితాబ్‌ ముందు సూర్య నిలబడాల్సి వస్తుందనీ, వెటకారంగా ఆ ఛానెల్‌ ప్రచారం చేసింది. ఈ కథనమే తమిళనాడులో ఇంత దుమారానికి కారణం. ఈ వివాదంపై తమిళ హీరో, నిర్మాత విశాల్‌ స్సందించాడు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఓ హీరో హైటు గురించి ఎలా వెటకారం చేస్తారు.. ఇవేనా మీ ఎథిక్స్‌ అని విశాల్‌ ప్రశ్నించారు సోషల్‌ మీడియా ద్వారా. నిజాలనికి సినిమాల్లో హీరోలకు హైట్‌ అస్సలు విషయమే కాదు. బాలీవుడ్‌ విషయానికి వస్తే షారూఖ్‌ ఖాన్‌ హైటెంత..? అమీర్‌ఖాన్‌ హైటెంత..? ఆ మాటకొస్తే సల్మాన్‌ఖాన్‌ హైటెంత..? ఇక టాలీవుడ్‌లో చాలా మంది యంగ్‌ హీరోలు ఏవరేజ్‌ హైట్‌ ఉంటారు. అయితే హైట్‌ వారికి ఎప్పుడూ ఇబ్బంది కాలేదు. 

ఇక హీరో సూర్య విషయానికి వస్తే, సూర్య విలక్షణ నటుడు. మాస్‌ని మెప్పించాడు. క్లాస్‌తో క్లాప్స్‌ కొట్టించుకున్న హీరో. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై స్టార్స్‌ అనదగ్గ హీరోల్లో సూర్య ఒకడు. అలాంటిది హీరో సూర్య హైట్‌ గురించి ఇలా ప్రచారం చేయడం పట్ల సదరు ఛానెల్‌ తీరును తప్పుపట్టకుండా ఉండలేకపోతున్నారంతా. వార్తల కోసం, ఇతరత్రా ఎన్నో అంశాలు ఉన్న సందర్భంలో ఈ హైట్‌ గురించిన నాన్సెన్స్‌ అనవసరం అనే చెప్పాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular