గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెద్ది సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా చూసిన అనంతరం చిత్రబృందాన్ని అభినందిస్తూ ప్రత్యేక పోస్ట్ చేశారు.
అల్లు అర్జున్ తన పోస్ట్‌లో రామ్ చరణ్ నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమాలో చరణ్ కనిపించిన రఫ్ అండ్ రా లుక్, పాత్ర కోసం చేసిన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. అలాగే డ్యాన్స్‌లలో చరణ్ చూపించిన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
‘రామ్ చరణ్ సాధిస్తున్న విజయాలు, అందుకుంటున్న ప్రశంసలు చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. అతను చేసిన కష్టానికి దక్కుతున్న ఫలితం ఇదే’ అంటూ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. అలాగే సినిమాలో నటించిన జగపతిబాబు, జాన్వీ కపూర్‌తో పాటు ఇతర నటీనటుల నటనను కూడా మెచ్చుకున్నారు. చిత్ర నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, దర్శకుడు బుచ్చిబాబు సనాపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.
ప్రతి పాత్రను సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు రామ్ చరణ్‌ను కొత్త కోణంలో చూపించినందుకు బుచ్చిబాబుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఒక దర్శకుడిగా ఆయన చూపించిన విజన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఈ స్పందనను స్వాగతిస్తూ, రెండు స్టార్ హీరోల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
— Allu Arjun (@alluarjun) June 9, 2026
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…





