మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం పెద్ది ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన ఆరంభాన్ని నమోదు చేసింది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పగా.. తొలి రోజు వసూళ్లతో ఆ అంచనాలను అందుకుంది. జూన్ 3 రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, మొదటి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన రావడంతో అన్ని ప్రాంతాల్లోనూ భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.
తాజాగా చిత్రబృందం విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం.. పెద్ది తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేయగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.
బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమైన పెద్ది తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టు సాధించడంతో.. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Box office CHAMPION – #PEDDI SIR
— PEDDI (@PeddiMovieOffl) June 5, 2026
💥💥💥💥💥💥 135.36 CR+ GROSS WW on Day 1 ❤️🔥❤️🔥
Meet #PEDDI now in cinemas ❤️🔥
Book your tickets now 💥💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/1WYLZ3215U





