గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ చిత్రం పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన మెగా కుటుంబ సభ్యులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ప్రస్తుతం షూటింగ్ పనుల నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ తన ఆలోచనలన్నీ పెద్ది గురించే ఉన్నాయని చిరంజీవి తెలిపారు. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టం, అంకితభావం, చూపిన నిబద్ధతను తాను దగ్గర నుంచి చూశానని పేర్కొన్నారు.
‘ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా ఉంది. పెద్ది పాత్ర కోసం చరణ్ చూపించిన అంకితభావం, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో కనిపిస్తోంది. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం’ అని చిరంజీవి అన్నారు.
అలాగే ఈ కథను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు సనాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సినిమాను భారీ స్థాయిలో నిర్మించిన నిర్మాత వెంకట సతీష్ కిలారుకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన శివరాజ్‌కుమార్, జగపతిబాబు, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు తెలిపారు. అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక బలం చేకూర్చిందని ప్రశంసించారు.
చివరిగా పెద్ది విజయం తెలుగు సినిమా గర్వంగా నిలవాలని, మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మెగాస్టార్ తన సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2026
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ… pic.twitter.com/gZwN99aERV





