HomeMovie News Teluguచిరంజీవి సినిమాలో విలన్‌గా డింపుల్ హయాతి?

చిరంజీవి సినిమాలో విలన్‌గా డింపుల్ హయాతి?

టాలీవుడ్‌లో ఎందరో హీరోయిన్లు ఉన్నప్పటికీ, కొందరే తమ ప్రత్యేక గుర్తింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో డింపుల్ హయాతి ఒకరు. గ్లామర్‌తో పాటు నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు కెరీర్‌లో కొత్త మలుపు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

2017లో వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డింపుల్ హయాతి, తర్వాత గద్దలకొండ గణేష్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్నారు. అనంతరం రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడి సినిమాలో నటించి మరింత గుర్తింపు పొందారు. తర్వాత రామబాణం, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాల్లోనూ కనిపించారు.

ఇప్పటివరకు గ్లామర్, హీరోయిన్ పాత్రలతో మెప్పించిన డింపుల్ హయాతి.. ఇప్పుడు నెగిటివ్ రోల్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డింపుల్ హయాతి విలన్ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ పాత్ర కోసం డింపుల్‌తో చిత్రబృందం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గతంలో కూడా ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో ఆమెను నెగిటివ్ రోల్ కోసం పరిశీలించినప్పటికీ, చివరికి ఆ అవకాశాన్ని వదిలేసినట్లు టాక్ ఉంది.

అయితే ఈసారి మాత్రం డింపుల్ హయాతి కొత్తగా విలన్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగానే చిరంజీవి సినిమాలో డింపుల్ హయాతి విలన్‌గా కనిపిస్తుందా? అన్నదానిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular