HomeMovie News Teluguఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్

ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని ఖండిస్తూ మేకర్స్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు.

ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ షర్ట్‌లెస్ లుక్‌ను విడుదల చేస్తూ, ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ.. అంతటి శబ్దం రాబోతోంది’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేశారు.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో తారక్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

విశాలమైన భుజాలు, సన్నని నడుముతో పక్కా ‘వి-టేపర్’ ఫిజిక్లో ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. బ్యాక్ డబుల్ బైసెప్స్ పోజ్‌లో ఆయన మసిల్స్ స్పష్టంగా హైలైట్ అవుతున్నాయి.

ఈ లుక్‌ను బట్టి చూస్తే, డ్రాగన్ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన వర్కౌట్స్, డైట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫిజిక్ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం షూటింగ్ షెడ్యూల్‌కు కొంత గ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో తెలిసిందే. అందుకే ఆయన విజన్‌కు తగ్గట్టుగా తారక్ తనను తాను పూర్తిగా మార్చుకుంటున్నారు.

ఈ ఒక్క ఫోటోతోనే డ్రాగన్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular