ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన మ్యూజిక్‌తో కోట్లాది మందిని ఆకట్టుకున్న ఆయన, ఎన్నో సినిమాలను సక్సెస్ వైపు నడిపించారు. ముఖ్యంగా కథ నచ్చితేనే సినిమా చేయడానికి ఒప్పుకునే రెహమాన్, ప్రతి ప్రాజెక్ట్‌కు తనదైన ప్రత్యేకతను తీసుకొస్తారు.
ఇదిలా ఉంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను అందుకోవడంతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా హై లెవెల్‌లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీంతో మ్యూజిక్ విషయంలో ఈ సినిమా మరో స్థాయికి వెళ్లనుందని అభిమానులు భావిస్తున్నారు.
తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం రెహమాన్ ప్రత్యేకంగా ‘పెద్ది ఆంథమ్’ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆంథమ్‌ను ప్రీ-రిలీజ్ ఈవెంట్ సమయంలో విడుదల చేసే అవకాశముందని టాక్.
అంతేకాకుండా.. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలకు రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించి దర్శకుడు బుచ్చిబాబుకు వినిపించారని, అవి నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి.. ‘పెద్ది’కి రెహమాన్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు భారీ ప్లస్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే, ఈ మూవీ మ్యూజిక్ పరంగా కూడా ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేసేలా కనిపిస్తోంది.





