HomeMovie News Teluguలెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత..

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత..

భారతీయ సంగీత ప్రపంచానికి పెద్ద దెబ్బ తగిలింది. లెజెండరీ గాయని, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఆశా భోస్లే (92) కన్నుమూశారు. కొద్దిరోజులుగా తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు చికిత్స అందించినప్పటికీ, ఆదివారం ఉదయం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. ఆమె అంత్యక్రియలు రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

భారతరత్న లతా మంగేష్కర్ సోదరిగా సంగీత రంగంలో అడుగుపెట్టిన ఆశా భోస్లే, 1943లో మరాఠీ చిత్రంతో గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. దాదాపు 70 ఏళ్ల సినీ ప్రయాణంలో 20కి పైగా భాషల్లో 12 వేలకు పైగా పాటలు పాడి కోట్లాది శ్రోతలను అలరించారు.

తన ప్రత్యేక గాత్రంతో భారతదేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులను ఆకట్టుకున్న ఆమె ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ఆమె పేరు నమోదు అయింది.

భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది.

ఆశా భోస్లే మరణంతో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె గాత్రం మాత్రం ఎప్పటికీ అమరంగా నిలిచిపోతుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular