HomeMovie News Teluguఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోపై భారీ అంచనాలు ఉండగా, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.

శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, మొదటి రోజే మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. అదే సమయంలో ధురంధర్-2 భారీ హిట్ కావడంతో ఉస్తాద్ రన్ త్వరగా ముగిసింది.

పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, కథలో బలహీనతలు సినిమా ఫలితాన్ని ప్రభావితం చేశాయి.

ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

ఏప్రిల్ 16 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ Netflixలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రీలీల అధికారికంగా వెల్లడించింది. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసే అవకాశం పొందుతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular