జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సౌమ్య రావు తాజాగా ఆ షో గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఈ కార్యక్రమంలో యాంకర్‌గా పనిచేసిన ఆమె, ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది.
అయితే అకస్మాత్తుగా షో నుంచి తప్పుకోవడంతో, ఆమె ఎందుకు వెళ్లిపోయిందనే అంశంపై అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌమ్య రావు వాటికి క్లారిటీ ఇచ్చింది.
తాను అసలు కన్నడ అమ్మాయినని, కర్ణాటక ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చానని తెలిపింది. మొదట్లో తెలుగు భాషపై పెద్దగా పట్టు లేకపోవడంతో సీరియల్స్ చేస్తున్న సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. అలాంటి సమయంలోనే తనకు జబర్దస్త్ లో యాంకర్‌గా అవకాశం వచ్చిందని వెల్లడించింది.
యాంకర్‌గా పనిచేయాలంటే స్పష్టంగా తెలుగు మాట్లాడాల్సి ఉంటుందని, పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఈ షోను చూస్తారని భావించి మొదట్లో చాలా టెన్షన్ పడ్డానని చెప్పింది. అయితే తర్వాత క్రమంగా తెలుగు నేర్చుకుని, ప్రేక్షకుల మన్ననలు పొందగలిగానని తెలిపింది.
ఇక తాను జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి హైపర్ ఆది కారణమనే వార్తలను పూర్తిగా ఖండించింది. ఆది తనకు ఎప్పుడూ సపోర్ట్ చేశాడని, తాను మంచి యాంకరింగ్ చేస్తున్న సమయంలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకు కూడా తనను సిఫార్సు చేసినట్లు వెల్లడించింది.
తాను షో నుంచి వెళ్లిపోవడానికి ఎవరూ కారణం కాదని, వ్యక్తిగత కారణాలతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని సౌమ్య రావు స్పష్టం చేసింది. దీంతో ఆమె ఎగ్జిట్‌పై వస్తున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడినట్టైంది.





