HomeMovie News Teluguహీరోయిన్ మంజు వారియర్‌కు చేదు అనుభవం..

హీరోయిన్ మంజు వారియర్‌కు చేదు అనుభవం..

ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు అభిమానుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు పెరుగుతున్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో కనిపిస్తే సెల్ఫీలు కోసం ఎగబడటం, అతిగా ప్రవర్తించడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.

ఇలాంటి ఘటన తాజాగా మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ కు ఎదురైంది. కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. అందరూ ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

అయితే ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని అనూహ్యంగా మంజు వారియర్ దగ్గరకు వెళ్లి బలవంతంగా ముద్దు పెట్టింది. ఈ సంఘటన అక్కడ ఉన్న వారందరినీ షాక్‌కు గురిచేసింది.

వెంటనే స్పందించిన ఈవెంట్ యాంకర్, అభిమానులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం సరైంది కాదు. మర్యాదగా ఉండాలి అంటూ సూచించింది.

ఇంత జరిగినప్పటికీ, మంజు వారియర్ మాత్రం చాలా కూల్‌గా స్పందించింది. ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయకుండా పరిస్థితిని హ్యాండిల్ చేయడం గమనార్హం.

ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీల ప్రైవసీ, భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular