టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ తన కెరీర్ ప్రారంభం నుంచే కామెడీ, రొమాంటిక్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అయితే, చాలా కాలంగా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయిన ఈ యంగ్ హీరో, ఇటీవల విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ సక్సెస్ తర్వాత సంతోష్ శోభన్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన కొత్త సినిమా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
స్వాతిముత్యం దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో సంతోష్ శోభన్ తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు UV Creations, AR Films సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా కథ ఫైనల్ అయిందని, టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘సత్తిబాబు పరలోకయాత్ర’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మూవీని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి, హిట్ ట్రాక్‌లోకి వచ్చిన సంతోష్ శోభన్ మరోసారి కామెడీ జానర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.





