HomeMovie News Teluguడెకాయిట్ ఈవెంట్‌లో మెరిసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

డెకాయిట్ ఈవెంట్‌లో మెరిసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

సినిమా విడుదలకు ముందే కొందరు నటీమణులు తమ లుక్, ప్రెజెన్స్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా డెకాయిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఒక బ్యూటీ అందరినీ ఆకట్టుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న డెకాయిట్ చిత్రం ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సినిమాలో కీలక పాత్ర పోషించిన జేయన్ మేరీ ఖాన్ హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌లో ఆమె సిల్వర్ కలర్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో హాట్ లుక్‌తో మెరిసింది. ఆమె స్టేజ్‌పై కనిపించగానే కెమెరాలన్నీ ఆమెవైపే తిరగడంతో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే ఈ బ్యూటీ ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. జేయన్ మేరీ ఖాన్ మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనకోడలు, ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్ కుమార్తె.

ఇప్పటికే బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జేయన్ మేరీ ఖాన్, ఇప్పుడు డెకాయిట్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది.

ఈ సినిమా హిట్ అయితే, టాలీవుడ్‌లో కూడా ఆమెకు మంచి అవకాశాలు రావడం ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె గ్లామర్, ప్రెజెన్స్ గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular