HomeMovie News Teluguమరో వివాదంలో రాజేంద్ర ప్రసాద్..

మరో వివాదంలో రాజేంద్ర ప్రసాద్..

టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన ప్రవర్తన, వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా తమిళనాడు ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

ఇటీవల నిర్వహించిన ‘కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు’ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్, ఆ వేదికపై దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంతారావు జానపద సినిమాలతో అప్పట్లో భారీ పేరు తెచ్చుకున్నారని చెప్పారు.

అయితే అదే సమయంలో ఎంజీఆర్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాంతారావు విజయాలను ఉదాహరిస్తూ ఆయన ఉపయోగించిన పదజాలం కొందరిని ఆగ్రహానికి గురిచేసింది. ముఖ్యంగా తమిళ ప్రజలు ఎంతో గౌరవించే ఎంజీఆర్‌ను ఉద్దేశించి తగని విధంగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక గొప్ప నటుడిని పొగడటంలో భాగంగా మరో లెజెండరీ నటుడిని తగ్గించి మాట్లాడడం సరైంది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాజేంద్ర ప్రసాద్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది.

ఇప్పటికే ఫోటో కోసం వచ్చిన ఓ యువకుడిని తోసేసిన ఘటనలో విమర్శలు ఎదుర్కొన్న రాజేంద్ర ప్రసాద్, ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular