టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. ఇటీవల పలువురు స్టార్ హీరోలు వివాహ బంధంలోకి అడుగుపెడుతుండగా, ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా అదే బాటలో నడుస్తున్నాడు. టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, మార్చి 8న హైదరాబాద్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా నిర్వహించినట్లు సమాచారం.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మనసు దోచుకున్న యువతి పేరు కావ్య రెడ్డి. ఆమెకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ప్రతిష్టాత్మక కుటుంబానికి చెందిన కావ్య రెడ్డి తాతగారు జడ్జిగా పనిచేసినట్లు, ఆమె తండ్రి ప్రముఖ న్యాయవాది అని సమాచారం. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Actress Samyuktha attends the Engagement Function of Hero #BellamkondaSrinivas as he gets engaged to Kavya.#SamyukthaMenon pic.twitter.com/dwbJaOphM2
— idlebrain.com (@idlebraindotcom) March 8, 2026
అయితే మరోవైపు ఇంత సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ ఎందుకు నిర్వహించారన్న చర్చ కూడా నెటిజన్లలో మొదలైంది. ప్రస్తుతం ఈ విషయంపై బెల్లంకొండ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పెళ్లి తేదీని గ్రాండ్‌గా ప్రకటిస్తారా లేదా నిశ్చితార్థం లాగానే పెళ్లిని కూడా సైలెంట్‌గా నిర్వహిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుండటంతో కుటుంబంలో, సినీ వర్గాల్లో సందడి నెలకొంది.





