HomeMovie News Teluguభార్యకు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!

భార్యకు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆయన తమ్ముడు అల్లు శిరీష్ – నైనిక రెడ్డి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మొదట్లో అల్లు అర్జున్ తన తమ్ముడు పెళ్లి సందర్భంగా ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారని వార్తలు ప్రచారం అయ్యాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఆ కారు అల్లు శిరీష్‌కు కాదు, తన భార్య స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్చి 6న తమ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా స్నేహ రెడ్డికి ఈ ప్రత్యేక బహుమతిని అందించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా బర్త్‌డే, మ్యారేజ్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడం అల్లు అర్జున్‌కు అలవాటే. ఈసారి కూడా తమ మ్యారేజ్ డేను ప్రత్యేకంగా గుర్తుండేలా చేసేందుకు భార్యకు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.

అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి వివాహ బంధానికి ఈ ఏడాది మార్చి 6తో 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2011లో ఈ జంట వివాహం జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు కూడా చేశారు.

ఇదే రోజున ఆయన తమ్ముడు అల్లు శిరీష్ కూడా నైనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో మ్యారేజ్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన భార్యకు బెంజ్ AMG మోడల్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఈ కారు మార్కెట్ విలువ సుమారు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కూడా మరో సినిమాకు ఆయన కమిట్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular