టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సొంత గ్రామంలో భార్య రష్మికతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో ఈ జంట గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా విజయ్ – రష్మిక పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి ఎంత ఖర్చు అయ్యిందన్న విషయంపై కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉదయ్‌పూర్‌లో జరిగిన నాలుగు రోజుల పెళ్లి వేడుకల నుంచి హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్ వరకు మొత్తం ఖర్చు దాదాపు రూ.15 నుంచి రూ.25 కోట్ల మధ్య ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
పెళ్లి కోసం ప్రత్యేకంగా బంగారు ఆభరణాలు కూడా భారీగా కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వివాహ వేడుక మొత్తం నిర్వహణ బాధ్యతలను ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ చూసుకున్నట్లు సమాచారం.
ఇక విజయ్ – రష్మిక పెళ్లి వీడియో హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.60 కోట్లకు ఈ డీల్ జరిగిందన్న ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.





