HomeMovie News Teluguశివాజీ కొత్త సినిమాకు స్పెషల్ ఆఫర్..

శివాజీ కొత్త సినిమాకు స్పెషల్ ఆఫర్..

టాలీవుడ్‌లో ఒకప్పుడు హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న శివాజీ, లయ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ స్వయంగా నిర్మించారు.

మొదట ఈ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నేరుగా విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన విడుదల తేదీ కూడా వెల్లడించారు. అయితే తర్వాత ప్లాన్ మార్చుకుని ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. దాంతో ఈ చిత్రాన్ని మార్చి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇటీవల చిన్న సినిమాలకు టికెట్ ధరలను తగ్గించే ట్రెండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ధరలతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇదే దిశగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రబృందం ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో నలుగురు కలిసి టికెట్లు తీసుకుంటే కేవలం రూ.499కే నాలుగు టికెట్లు మరియు ఒక పాప్‌కార్న్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలిపింది. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో నలుగురికి పాప్‌కార్న్‌తో కలిపి టికెట్ ధర కేవలం రూ.799గా నిర్ణయించారు.

ఈ ప్రత్యేక ఆఫర్ ప్రేక్షకులను ఆకర్షించి సినిమాకు కలెక్షన్ల పరంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. చిన్న సినిమాలకు కొత్తగా ప్రయత్నాలు చేస్తున్న ఈ మూవీ టీమ్‌పై ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular