HomeMovie News Teluguఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ డీల్ ఫిక్స్..

ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ డీల్ ఫిక్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ఓటీటీ పార్టనర్ ఫైనల్ కాగా, దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.80 కోట్లకు ఈ డీల్ కుదిరిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్ అనే వార్తలు గతంలో వైరల్ అయ్యాయి. అయితే స్క్రీన్‌ప్లే రైటర్లలో ఒకరైన దశరథ్ స్పందిస్తూ ఇది ఏ సినిమాకీ రీమేక్ కాదని, పూర్తిగా కొత్త కథతో రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.

మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిజంగా రీమేక్‌గా వస్తుందా లేక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానుందా అన్నది మార్చి 26న సినిమా విడుదలయ్యాకే క్లారిటీ రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular