HomePolitics Teluguహార్వర్డ్ వేదికపై సీఎం రేవంత్.. భారత్ నుంచి ఏకైక ఆహ్వానం!

హార్వర్డ్ వేదికపై సీఎం రేవంత్.. భారత్ నుంచి ఏకైక ఆహ్వానం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం మార్చి 27న అమెరికాలోని హార్వర్డ్ క్యాంపస్‌లో జరగనుంది.

ఈ సదస్సులో పాల్గొనేందుకు భారతదేశం నుంచి ఆహ్వానం పొందిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం విశేషంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యా రంగ నిపుణులు పాల్గొనే ఈ వేదికలో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కనుంది.

“AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే కీలక అంశంపై జరిగే ప్యానెల్ చర్చలో సీఎం పాల్గొంటారు. AI అభివృద్ధి వల్ల మానవ జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు ఎలా మారతాయనే విషయంపై ఆయన తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్ల పాత్రపై ఈ సెషన్‌లో లోతైన చర్చ జరగనుంది.

తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను హార్వర్డ్ నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. రాష్ట్రంలో ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ ఏర్పాటు, భూమి మరియు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వివరించాలని ఆయనను కోరినట్లు సమాచారం.

ఇటీవల హార్వర్డ్‌లో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సమయంలోనే నిర్వాహకులు స్వయంగా ఈ ఆహ్వానం అందించినట్లు తెలిసింది. ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యావేత్తల మధ్య సమన్వయం ద్వారా ఏఐ రంగంలో ఎలా పురోగతి సాధించవచ్చో ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజేయనున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular