HomeMovie News Teluguవెడ్డింగ్ ఆఫ్ విరోష్.. విజయ్ - రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్!

వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. విజయ్ – రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్!

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పటివరకు ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. తాజాగా ఇద్దరూ తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

అభిమానులు తమ ఇద్దరి పేర్లను కలిపి ప్రేమగా “విరోష్” (ViRosh) అని పిలుస్తున్నారని, అదే పేరును తమ పెళ్లి వేడుకకు అధికారికంగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’

“మేము ఏదైనా అనుకునేలోపే మా ఫ్యాన్స్ అన్నీ ప్లాన్ చేసేస్తున్నారు. వారు పెట్టిన ‘విరోష్’ అనే పేరు మాకు చాలా నచ్చింది. అందుకే మా పెళ్లి వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాం” అంటూ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

వీరిద్దరి వివాహం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరగనుంది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. అలాగే పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో తెరపై హిట్ జోడీగా నిలిచిన విజయ్–రష్మిక, ఇప్పుడు నిజ జీవితంలో కూడా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకోవడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular