HomeMovie News Teluguగాన గంధర్వుడిపై వివాదమా !?

గాన గంధర్వుడిపై వివాదమా !?

గాన గంధర్వుడు SP బాల సుబ్రహ్మణ్యం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. రాజకీయ, ప్రాంతీయ విభేదాలతో అమర గాయకుడిని అవమాన పరుస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ లాంటి అనేక భాషల్లో కొన్ని లక్షల పాటలు పాడిన బాలు మా ప్రాంతం వాడు కాదని అనటం సిగ్గు చేటు. అన్ని భాషల వాళ్ళు బాలుని ఓన్ చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రా అంటూ ప్రాంతీయ బేధం చూపి తిరస్కరణ చేయటం తెలుగు జాతికే అవమానం.

ఇంతకీ విషయం ఏంటి అంటే తెలంగాణా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ చేయాలనుకున్నారు. డిసెంబరు 15 బాలు జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ట నిర్ణయించారు. దీనికి టీజీ సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఇప్పుడు బాలు తెలంగాణ వ్యక్తి కాదు, ఏపీ కి చెందిన వాడు, రవీంద్ర భారతిలో కేవలం తెలంగాణ ప్రముఖులకు మాత్రమే చోటు దక్కాలని పృథ్వీ రాజ్ అనే సామిజిక కార్య కర్త నిరసనకు దిగాడు. మన మధ్య లేని వ్యక్తిని కించ పరుస్తూ బాలు తెలంగాణ వ్యతిరేఖ వాది అని బురద చల్లటం అమానవీయం.

బాలు లాంటి సుప్రసిద్ధ గాయకుడికి సముచిత స్థానం కల్పిస్తే అది తెలంగాణ కళామతల్లికి గౌరవం. డిసెంబర్ 14న ఎస్పీ బాలు విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుని తీరాలని ఉద్యమకారులకి పిలుపునిచ్చారు పృథిరాజ్. ‘కళకు సరిహద్దులు లేవు. ఎస్పీబీ తెలుగు సినిమా, సంగీతానికి అమరుడు. ఆయన విగ్రహం ప్రాంతాల ఐక్యతను పెంచుతుందని శుభలేఖ సుధాకర్ ఆవేధన చెందారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వివాదం ట్రెండింగ్ లో ఉంది. కొందరు ప్రాంతీయత్వాన్ని సమర్థిస్తూ #TelanganaFirst హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు ఎస్పీబీ కి గట్టి మద్దతు తెలుపుతూ, “సంగీతం ఒక్కటే” అంటున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular