HomePolitics Teluguనాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్!

నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్!

తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై చేసిన తాజా ట్వీట్‌తో మరోసారి సంచలనం రేపారు. గతంలో సమంత-నాగ చైతన్య వివాహ విభేదాల అంశంపై నాగార్జున కుటుంబంపై చేసిన కామెంట్లతో వార్తల్లో నిలిచిన సురేఖ, ఇప్పుడు మాత్రం అర్ధరాత్రి చేసిన పోస్ట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.

తాజా ట్వీట్‌లో కొండా సురేఖ, నాగార్జున ఫ్యామిలీపై గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

“నా మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగిందంటే, దానికి నేను చింతిస్తున్నాను. అక్కినేని కుటుంబాన్ని కించపరచాలన్న ఉద్దేశ్యం నాకు ఎప్పుడూ లేదు. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను” అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అర్ధరాత్రి 12 గంటల తర్వాత చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొండా సురేఖ ఈ విధంగా స్పందించడం వెనుక కాంగ్రెస్ హైకమాండ్ సూచనలే ఉన్నాయా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల కారణంగా అక్కినేని నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె ట్వీట్‌తో ఈ వివాదం ముగిసిందా, లేక మరో మలుపు తిరుగుతుందా అనేది చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular