HomeSports Teluguఎట్టకేలకు నెరవేరిన కల.. వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు

ఎట్టకేలకు నెరవేరిన కల.. వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు

ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌-సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చడంతో, భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరి, భారత మహిళల జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

ఈ ఫైనల్‌లో భారత బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ సమానంగా సత్తా చాటారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో భారత జట్టు అసాధారణ ప్రతిభ కనబరిచి, సౌతాఫ్రికా బ్యాటర్లను ఒత్తిడికి గురిచేశారు. షెఫాలి వర్మ, దీప్తీ శర్మ కీలక సమయాల్లో తీసిన వికెట్లు విజయానికి బాటలు వేశాయి.

ఏకమై ఆడిన భారత మహిళల జట్టు, దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయం తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. అభిమానులు వీధుల్లోకి వచ్చి జట్టు విజయాన్ని ఘనంగా జరుపుకుంటుండగా, సోషల్ మీడియా అంతా #WomenInBlue మరియు #WorldChampions హ్యాష్‌ట్యాగ్‌లతో సందేశాలతో మార్మోగుతోంది.

ప్రధాని నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ భారత మహిళల జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఘట్టంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల కృషి, అంకితభావం, పట్టుదలతో సాధించిన ఈ ట్రోఫీ భారత జట్టులో కొత్త తరం ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular