HomeMovie News Teluguకర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు.. జానీ మాస్టర్‌పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు.. జానీ మాస్టర్‌పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంతకు డబ్బింగ్ చెప్పి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిన్మయి, మీటూ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తర్వాత కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరమయ్యింది. కోలీవుడ్‌లో నిషేధం ఎదుర్కొన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది.

తాజాగా చిన్మయి మరో సెన్సేషనల్ పోస్ట్ పెట్టి మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) మరియు సింగర్ కార్తీక్ (Karthik) పై విమర్శలు చేస్తూ చిన్మయి కఠిన వ్యాఖ్యలు చేసింది.

ఆమె తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది –

“జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వారికి మళ్లీ అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే. డబ్బు, అధికారం దుర్వినియోగం చేసే వారి చేతుల్లో మళ్లీ అవకాశాలు ఇవ్వొద్దు. కర్మ నిజమైతే… అది ఎవ్వరినీ వదిలిపెట్టదు.”

ఇటీవల జానీ మాస్టర్‌పై ఒక అసిస్టెంట్ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆయనపై కేసు నమోదై, అరెస్ట్ అయ్యారు. కొన్ని రోజుల జైలు జీవితం తర్వాత బెయిల్‌పై విడుదలైన జానీ మాస్టర్, ప్రస్తుతం మళ్లీ స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular