HomePolitics Teluguవిశాఖలో మెగా డేటా సెంటర్: గూగుల్-ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం

విశాఖలో మెగా డేటా సెంటర్: గూగుల్-ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం

దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక ఘట్టం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గూగుల్ మెగా డేటా సెంటర్ (Google Mega Data Center) స్థాపన కోసం గూగుల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం సంతకం అయ్యింది.

ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఇతర మంత్రులు, ఎంపీలు మరియు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

తాజా ఒప్పందం ప్రకారం, గూగుల్ మరే పదేళ్లలో ఏపీలో ₹80,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది.

ఒప్పందం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. “ఇది మనందరికీ చాలా శుభప్రదమైన, సంతోషకరమైన రోజు. ముందుగా ప్రధాన మంత్రికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇది సాధ్యమైనందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. గూగుల్ సృజనాత్మకత, వేగం చాలా ముఖ్యమైనవి. మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌లో తీసుకురావడం జరిగింది. ఈ రోజు గూగుల్‌ను విశాఖలోకి తీసుకురావడం సంతోషంగా ఉంది. దీనివల్ల అనేక పారిశ్రామిక వేత్తలు విశాఖ వైపు ఆసక్తి చూపుతున్నారు. అలాగే, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడతాయి” అని అన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular