HomeMovie News Telugu'ఆర్య' కాంబో మళ్లీ సెట్టయ్యింది.!

‘ఆర్య’ కాంబో మళ్లీ సెట్టయ్యింది.!

అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబోలో సినిమా సెట్‌ అయ్యిందని లేటెస్ట్‌గా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అల్లు అర్జున్‌కి కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ మూవీ ‘ఆర్య’ వంటి సినిమాని అందించిన సుకుమార్‌ ఆ తర్వాత ‘ఆర్య 2’తో నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత ఈ కాంబో సెట్‌ కాలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అల్లు అర్జున్‌కి సుకుమార్‌ ఓ స్టోరీ వినిపించాడట. ఆ స్టోరీ బన్నీకి తెగ నచ్చేసిందట. అసలే అల్లు అర్జున్‌ సరైన హిట్‌ లేక కొట్లాడుతున్నాడు. ఈ తరుణంలో సూపర్‌ సక్సెస్‌లో ఉన్న సుకుమార్‌తో మూవీ అంటే బన్నీ ఫ్యాన్స్‌కి అసలు సిసలు పండగే మరి. 

అయితే ప్రస్తుతం సుకుమార్‌ మహేష్‌ కోసం స్క్రిప్టు ప్రిపేర్‌ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు మహేష్‌బాబు ‘మహర్షి’ తర్వాత అనిల్‌ రావిపూడితో సినిమాకి కమిట్‌ అయ్యాడు. అనిల్‌ సినిమా తర్వాత సుకుమార్‌తో మహేష్‌ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది.అందుకు టైం చాలానే ఉందనుకోండి. ఈలోగా బన్నీ – సుకుమార్‌ కాంబో లేటెస్ట్‌గా తెరపైకి రావడంతో ఈ కాంబినేషన్స్‌పై కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. 

అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమా రేపో మాపో సెట్స్‌ పైకి వెళ్లనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అంతకంతకూ ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. మార్చి నెలాఖరులో ఎట్టి పరిస్థితుల్లోనూ త్రివిక్రమ్‌ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా పరిస్థితే ఇలా ఉంటే, ఇక సుకుమార్‌ – బన్నీ సినిమా ఎప్పుడు పట్టాలెక్కేనో వేచి చూడాలిక. అన్నట్లు ఈ సినిమా మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రూపొందనుంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular