HomeMovie News Teluguవర్మగారూ.. మీరు మారిపోయారా.?

వర్మగారూ.. మీరు మారిపోయారా.?

వివాదాలతో సావాసం చేస్తూ, సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా పేరున్న రామ్‌గోపాల్‌ వర్మలో ఈ మధ్య ఊహించని మార్పులెన్నో కనిపిస్తున్నాయి. ‘నేనింతే.. నేనిలాగే ఉంటా.. నేను నాలాగే ఉంటా..’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో వెంకటేష్‌ చెప్పిన డైలాగులు వర్మగారికి బాగా వర్తిస్తాయి. అయితే ఈ మధ్య వర్మలో చాలా మార్పు వచ్చింది. 

సోషల్‌ మీడియాలో తనదైన శైలి ట్వీట్స్‌ పోస్ట్‌ చేసి మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచే రామ్‌గోపాల్‌ వర్మ ఈ మధ్య తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. మొన్న తన కూతురు చిన్నప్పటి ఫోటో పోస్ట్‌ చేసి ప్యాన్స్‌కి షాక్‌ ఇచ్చిన వర్మ, లేటెస్ట్‌గా మరికొన్ని ఫోటోలు పోస్ట్‌ చేశారు. ఆ ఫోటోలో వర్మతో పాటు ఉన్నది ఆయన మేనకోడలట. పేరు శ్రావ్య వర్మ. టాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేస్తోంది. 

ప్రముఖ తారలు త్రిష, రష్మికా మండన్నా, కీర్తిసురేష్‌, రాశీఖన్నా తదితర ముద్దుగుమ్మలకు శ్రావ్య కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్‌ చేసింది. ముసలివాన్నైనా నాకు మంచి మంచి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తానంటోంది.. అని వర్మ ఆమెతో కలిసి దిగిన ఫన్నీ ఫోటోల్ని షేర్‌ చేశారు. ఏంటీ.? రామ్‌గోపాల్‌ వర్మేనా ఇదంతా చేస్తోంది.. అంటూ సెలబ్రిటీలు కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మరక మంచిదే అన్నట్లుగా వర్మలో వచ్చిన ఈ మార్పు మంచిదే అని సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular